calender_icon.png 30 October, 2024 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముల్కనూర్ సభ్యులకు 160 కోట్ల బోనస్

01-08-2024 12:05:00 AM

భీమదేవరపల్లి, జూలై 31: ముల్కనూర్ మహిళా సహకార డెయిరీ 22వ వార్షిక మహాసభ బుధవారం నిర్వహించారు. డెయి రీ పరిధిలోని 23 వేల కుటుంబాలకు డెయిరీలో వచ్చిన లాభాల్లో ఇప్పటి వరకు రూ.160కోట్లు బోనస్ రూపంలో అందించినట్లు ముల్కనూర్ సహకార బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. అలాగే విజయదశమి రోజున రూ.12 కోట్లు పంపిణీ చేస్తామన్నారు. డెయిరీ పరిధిలోని ప్రతి కుటుంబానికి దాదాపు లక్ష రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సంఘానికి డెయిరీ జీఎం భాస్కర్‌రెడ్డి అవార్డును అందజేశారు. మహాసభలో డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ పాల్గొన్నారు.