calender_icon.png 13 February, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద శాతం టాక్స్ వసూలు చేయాలి

13-02-2025 06:51:07 PM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని  కలెక్టరేట్ భవనంలో ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావుతో కలిసి మున్సిపల్ అధికారులతో పన్ను వసూలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని, పెండింగ్ లో ఉన్న పన్నులను వెంటనే వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఈ క్రమంలో పన్ను వసూలుకు సంబంధించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.