కోదాడ మున్సిపాల్టీ ప్రత్యేక అధికారి రాంబాబు
కోదాడ, జనవరి 31: కోదాడ మున్సిపాల్టీ లో నూరు శాతం ఇంటి పన్ను, నీటి పన్ను వసూలు చేయాలని అధికారులకి జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపాల్టీ ప్రత్యేక అధికారి పి. రాంబాబు సూచించారు. శుక్రవారం కోదాడ పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ విభాగముల అధికారులులతో సమీక్షా సమావేశము నిర్వహించినారు.
ఈ సందర్భముగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో యల్.ఆర్.యస్. స్కీమ్ కింద వచ్చిన ధరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా, పట్టణములో పారిశుద్ధ్య కార్యక్రమములు రోజు వారీగా నిర్వహించవలసినదిగా ఆదేశించారు.
ఈ మాస్టర్ ప్లాన్ తయారిలో పాల్గొను సర్వే ఆఫ్ ఇండియా టీమ్ వారిని వివరములు అడిగి తెలుసుకున్నారు. త్వరగా సర్వే కార్యక్రమమును పూర్తి చేయవలసినదిగా తెలియజేసినారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఏ.రమాదేవి, డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ అధికారి మాధవి, టౌన్ ప్లానింగ్ అధికారి జి.రమేష్, మేనేజరు బి.సాయిలక్ష్మి, ఇంజనీర్ యమ్. ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.