calender_icon.png 3 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థికాభివృద్ధికి వంద శాతం

28-03-2025 01:13:15 AM

విజయవంతం దిశగా చర్యలు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి టౌన్, మార్చి 27 : మహిళా సాధికారత, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో వంద శాతం విజయవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం ఉదయం సీఈఓ, సెర్ప్ దివ్య దేవరాజన్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో యుబిఐడి సదరం,  భర్త/భార్య చనిపోయిన వారికి  వృద్ధాప్య పెన్షన్ అమలు , శాశ్వత వలసలు,జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, ఎస్.హెచ్జి గ్రూపుల ద్వారా పాఠశాల విద్యార్థుల  యూనిఫాం కుట్టడం, జిల్లాలో  పెట్రోల్ బంక్ ఏర్పాటు, ఆర్సెటి  పనులు  వేగవంతం చేయడం, ఎస్.హెచ్జి గ్రూపులకు రుణ బీమా మరియు మరణ బీమా సదుపాయం అమలు అనే అంశాలపై.   జిల్లా కలెక్టర్లతో చర్చించి తగు సూచనలు చేశారు.

అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, పి.డి. గ్రామీణాభివృద్ధి శాఖ ఉమాదేవి, డి.పి.యం అరుణ, ఎల్.డి యం కౌశల్ కిషోర్ పాండే, డి. ఈ. ఒ మొహమ్మద్ గని తదితరులు పాల్గొన్నారు.