calender_icon.png 20 November, 2024 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

115 కిలోల గంజాయి పట్టివేత

21-07-2024 01:45:41 AM

  • ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

సంగారెడ్డి, జూలై 20 (విజయక్రాంతి) : ఒరిస్సా నుంచి అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. శనివా రం 65వ జాతీయ రహదారిపై గల కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తు న్న కారును పట్టుకున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని పథార్డి(గన్‌పూర్)కు చెందిన బాబాసాహెబ్ ఏకనాథ్ ఖేఫర్(32), అజినాథ్ భిడే (35) ఒరిస్సా రాష్ట్రం నుంచి అక్రమంగా రెండు కార్లలో 115 కిలోల గంజాయిని తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయి మొత్తం విలువ మార్కెట్‌లో రూ.42 లక్షలు ఉంటుందన్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, సెల్‌ఫోన్లు, రూ. 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ డివిజన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు గాంధీ నాయక్, పి.వీణారెడ్డి, చంద్రశేఖర్, ఎస్సైలు అనిల్‌కుమార్. యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 

చంగిచర్లలో 1.9 కిలోలు.. 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంగిచర్లలో ఎక్సై జ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో 1.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.  అదేవి ధంగా ఘట్‌కేసర్ ప్రాంతంలో ఎక్సై జ్ శాఖ దాడులు నిర్వహించి 253 గ్రాము లు గంజాయి, 390 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

గంజాయి చాక్లెట్లు విక్రయం

ఘట్‌కేసర్:  కిరాణా షాపులో గంజాయి చాక్లె ట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీసులు. అతని వద్ద నుంచి ఎండు గంజాయి, చాక్లెట్లు స్వాధీ నం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జే రవి తెలిపిన వివరాల ప్రకారం, పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో బీహార్‌కి చెందిన బబూ ్లకుమార్(53) తన కిరాణా షాపులో గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయి తో పాటు గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు జరిపారు. దాడిలో 253 గ్రాముల ఎండు గం జాయి, 390 గ్రాముల గంజాయి చాక్లెట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దుకాణాన్ని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.