calender_icon.png 20 October, 2024 | 5:23 AM

మక్క కొనుగోలు కేంద్రాలు వంద

20-10-2024 02:49:27 AM

మార్క్‌ఫెడ్

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ర్టంలో 5,46,865 ఎకరాల్లో మ క్కజొన్న సాగుచేయగా, 9,63,102 మెట్రిక్ టన్నులు పంట దిగుబడి వ చ్చే అవకాశం ఉందని మార్కెఫెడ్ అ ధికారులు తెలిపారు. రైతులకు మద్ద తు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వంద మక్క కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు క్వింటా మక్కకు రూ.2,225 మద్దతు ధర అందిస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల కొందరు దళారులు మద్దతు ధర కంటే రూ.75 నుంచి రూ.100 తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అందుకే రైతులు నష్టపోకుండా మొక్కజొన్న కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందన్నారు. రాష్ర్టంలో లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కనీ స మద్దతును ధరకు కొనుగోలు చేయడానికి మార్క్ ఫెడ్ అంగీకరించిందని తెలిపారు.