calender_icon.png 20 April, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గులాబీ సభకు లక్షన్నర మంది!

17-04-2025 12:27:35 AM

ఉమ్మడి జిల్లానుంచి తరలింపు

నియోజక వర్గానికి వంద బస్సులు

సన్నద్ధం అవుతున్న నాయకులు, శ్రేణులు

కరీంనగర్, ఏప్రిల్16 (విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజక వర్గాల నుండి లక్ష యాబై మందిని సమికరించాలని నిర్ణయించారు. ఇందుకు ఇప్పటికే 400 ఆర్ టి సి ఉస్సులని అద్దెకు తీసుకున్నారు. ఇవి కాకుండా ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులను సిద్ధం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె టి ఆర్ రెండు సార్లు కరీంనగర్ లో పర్యటించి నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హుస్నా బాడ్ నాజీ ఎమ్మెల్యే ఓడితల సతీష్ బాబులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, గులాబీ కార్యకర్తలు తరలిలి రానున్న నేపథ్యం లో 1200 ఎకరాల స్థలం లో  భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంయున్నారు. తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి& తెచ్చి చూపించి తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్దే అంటూ  సోషల్ మీడియాలో సభ  విజయయవంతం కోసం విస్తృత ప్రచారం  చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందింసని పేర్కొంటూ ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలైందని వివరిస్తూ సభకు తరలి వచ్చేందుకు ప్రజలను జాగృతం చేసే ప్రయత్భం ఆ పారీ ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యే లు నియోజకవర్గాలలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. కె సి ఆర్ సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ ను డి లక్షన్నర కు తగ్గకుండా జబలని  సమైమరించేందుకు ఏర్పాట్లూ చేస్తున్నారు.

ప్రజలనుండి స్పందన ఉంది 

ప్రజలనుండి మంచి స్పందన వస్తుంది భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయం. ప్రజా క్షేత్రంలో గెలుపు ఓటములు సహజం. ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తాము. కె సి ఆర్ సెంటిమెంట్ జిల్లా లో తగొలి బహిరంగ సభ సింహ గర్జన విజయబంతమైనది, కరీంనగర్ పార్లమెంటు పరిధి లోని ఎల్కతుర్తి లో జరిగే  సిల్వర్ జూబ్లీ సభ విజయవంత మవుతుంది.

- జీవీ రామకృష్ణరావు , బీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు