న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి వెళ్లనున్న 117 మంది అథ్లెట్ల తుది జాబితాను భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) బుధవారం విడుదల చేసింది. విశ్వక్రీడల్లో పాల్గొననున్న అథ్లెట్లకు సంబంధించిన జాబితాకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ జాబి తాలో మహిళా షాట్‌పుట్ క్రీడాకారిణి అబా కతువా పేరు కనిపించలేదు. ప్రపంచ ర్యాంకి ంగ్స్ ఆధారంగా అబా పారిస్ క్రీడలకు అర్హత సాధించింది.
అయితే అబా కతువా పేరు ఎందుకు తొలగించారన్న దానిపై స్పష్టత రాలేదు. మొత్తం 117 మంది అథ్లెట్లతో పాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా పారిస్‌కు వెళ్లనుంది. పారిస్ క్రీడలకు వెళ్లనున్న బృందంలో అథ్లెటిక్స్ నుంచి అత్యధికంగా 29 మంది ఉన్నా రు. ఆ తర్వాత షూటింగ్ (21), హాకీ జట్టు (19), టేబుల్ టెన్నిస్ (8), బ్యాడ్మింటన్ (7), రెజ్లింగ్ (6), ఆర్చరీ (6), బాక్సింగ్ (6), గోల్ఫ్ (4), టెన్నిస్ (3), స్విమ్మింగ్, సెయిలింగ్ నుంచి ఇద్దరేసి ఉన్నారు. ఈక్రెస్ట్రియన్, జూడో, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఒక్కొక్కరు పోటీ పడనున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు 119 మంది అథ్లెట్ల బృందం వెళ్లిన సంగతి తెలిసిందే.