calender_icon.png 24 February, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు విద్యార్థులకు ఒకే హాల్ టికెట్

23-02-2025 10:48:48 PM

పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి..

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ మండల పరిధిలోని స్వర్ణ భారతి కళాశాలలో నిర్వహించిన గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష కేంద్రంలో గందరగోళం నెలకొన్నది. ఒకే హాల్ టికెట్ ను ఇద్దరు విద్యార్థులకు కేటాయించడంతో ముందుగా వచ్చిన విద్యార్థి పరీక్ష రాయగా ఆ వెనకే వచ్చిన మరో విద్యార్థి పరీక్ష రాయలేకపోయాడు. దీంతో రెండో విద్యార్థిని నిర్వాహకులు లోపలికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. అధికారుల తప్పిదం వల్లే తమ బాబు పరీక్ష రాయలేకపోయాడని, వెంటనే న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. అలాగే కూసుమంచికి చెందిన మరో విద్యార్థికి మెమో లేదని పరీక్షకు అనుమతించలేదు. నేలకొండపల్లి మండలానికి ఇంకో విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం రూ.1.30 లక్షలకు బదులు రూ.13 లక్షలు పడటంతో పరీక్ష రాయలేకపోయాడని తెలిసింది.