calender_icon.png 12 March, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

12-03-2025 12:00:00 AM

కాటారం, మార్చి 11 (విజయక్రాంతి) : అన్నను హత్య చేసిన కేసులో తమ్ముడికి జయశంకర్ భూపాలపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. మంగళవారం జరిగిన జడ్జిమెంట్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు తీర్పును వెలువరించారు.  నిందితుడు మారుపాక అశోక్ కు జీ విత ఖైదు విధిస్తూ, పదివేల రూపాయల జరిమానాన్ని విధించారు.

  కాటారం మం డలం గంగారం గ్రామములో మారుపాక అశోక్, మారుపాక నాగరాజు అన్నదమ్ములు కాగా, స్వగ్రామంలో ఇంటి స్థలం ఉండగా నిందితుడు అశోక్, అతని అన్న మారుపాక నాగరాజు, వీరి తల్లి మారుపాక శంకరమ్మ సమానంగా పంచుకున్నారు. ఈ విషయంలో వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసింది. 2019 మే నెల 10 తారీకున ఎంపీటీసి ఎలక్షన్ లో ఓటు వేయడానికి తన ఊరు గంగారం కు నిందితుడు రాగ ఇంటి స్థలం విషయంలో తన అన్నతో గొడవపడి ఖాళీ బీరు బాటిల్ పగులగొట్టి తన అన్న గొంతులో పొడవగా చనిపోయినాడు.

నిందితునిపై నేరం రుజువు అయినందున భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు  నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ, పదివేల రూపాయలు జరిమాన వేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన  దర్యాప్తు అధికారులను భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ప్రభాకర్ అభినందించినారు.