23-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22(విజయ క్రాంతి): మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తికి జీవితకాలం తోపాటు రూ.60 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెష న్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం వి రమేష్ మంగళవారం తీర్పునిచ్చారు. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పర్సనంబాల గ్రామానికి చెందిన 17 సంవత్సరాల అమ్మా యి తన తల్లి మరణించడంతో నాన మ్మ దగ్గర ఉంటుంది.
అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని పలుమా ర్లు శారీరకంగా వాడుకున్నాడు. బాధితురాలు 14 సెప్టెంబర్ 2020 న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ అశోక్ కేసు నమోదు చేశారు.పబ్లిక్ క్లాసిక్యూటర్ జగన్మోహన్ రావు, సిడిఓ అండ్ టైజనింగ్ అధికారి రాంసింగ్ సాక్షులను కోర్టు లో హాజరుపరచగా న్యాయమూర్తి విచారించి నేరం రుజువు కావడం తో పై విధంగా తీర్పునిచ్చారు.