calender_icon.png 20 November, 2024 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

152 కోట్లు @ 2036

14-08-2024 01:32:01 AM

  1. 2036 నాటికి 152 కోట్లకు భారత జనాభా 
  2. మహిళల నిష్పత్తి పెరిగే అవకాశం 
  3. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారత జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023’ నివేదికలో వెల్లడించింది. అయితే ఇందులో మహిళల నిష్పత్తి పురుషులతో పోలిస్తే కొంత పెరిగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. 2011 నాటికి 48.5 శాతం మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభా.. 2036 నాటికి 48.8శాతం మహిళలతో 152.2 కోట్లకు చేరుకోనుంది. 15 ఏళ్ల లోపు వయసున్నవా రి సంఖ్య కొంత తగ్గనుంది. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో 2036 నాటికి జనాభా పిరమిడ్‌లో అనూహ్య మార్పులు రానున్నాయని నివేదికలో పేర్కొంది. 

  1. 2036 నాటికి పనిచేసే వయసున్న జనా భా పెరుగుతుంది. 2011లో 15 ఏళ్ల వయసున్న వారి జనాభా 60.7 శాతం ఉండగా 2036 నాటికి అది 64.9 శాతానికి చేరనుంది.
  2. 2011తో పోలిస్తే 2036 నాటికి జనాభాలో మహిళల నిష్పత్తి కొంత పెరుగుతుం ది. ఇది లింగ సమానత్వానికి సానుకూల సంకేతం.
  3. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 37.7 కోట్లు ఉండగా 2036 నాటికి 59.4 కోట్లకు చేరనుంది. అదే సమయంలో గ్రామీణ జనాభా 83.3 కోట్ల నుంచి 92.7 కోట్లకు పెరగనుంది.
  4. 2011 లెక్కల ప్రకారం 10 ఏళ్ల వయసున్నవారు అత్యధికంగా 10.8 శాతం ఉండగా, 2036 నాటికి 35 ఏళ్ల వయసువారి సంఖ్య అత్యధికంగా 8.3శాతం ఉండనుంది.
  5. 2011 లెక్కల ప్రకారం 80 ఏళ్ల వయసు న్న వారి సంఖ్య 0.5 శాతం ఉండగా 2036 నాటికి 1.5 శాతానికి పెరగనుంది.
  6. 2036 నాటికి జనాభా పెరుగుదల వలన స్త్రీ, పురుషుల నిష్పత్తి 943 నుంచి 952కు చేరబోతుంది. తద్వారా లింగ సమానత్వం కోసం ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి.