calender_icon.png 24 October, 2024 | 6:50 AM

57 క్రికెట్ క్లబ్బుల్లో ఒకే కుటుంబం

24-10-2024 02:35:25 AM

  1. సుప్రీంకోర్టుకు జస్టిస్ లావు కమిటీ నివేదిక
  2. హెచ్‌సీఏపై నివేదికను విచారించిన కోర్టు 

న్యూఢిల్లీ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో నెలకొన్న వివాదాలపై సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఒకే కుటుంబ పెత్త నం, హెచ్‌సీఏ ఎలక్ట్రోరల్ లిస్ట్ తయారీ, ఎన్నికల నిర్వహణపై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఏక సభ్య కమిటీ విచారణ జరిపింది.

హెచ్‌సీఏ అ ధ్యక్ష ఎన్నికల విధానం, ఓటర్ నమోదు ఇతర అంశాలపై 30 ఏప్రిల్, 2021లో హెచ్‌సీఏ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చా ర్మినార్ క్రికెట్ క్లబ్, బడ్డింగ్ స్టార్ క్రికెట్ క్లబ్‌ల ను ప్రతివాదులుగా చేర్చింది. 2023 ఫిబ్రవరి 14న హెచ్‌సీఏ కార్యకలాపాల కోసం తొలుత జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీని నియమించింది.

అయితే కమి టీ చైర్మన్‌కు సంబంధం లేకుండా సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించారనే అభియోగా లు వచ్చాయి. రిపోర్టును సుప్రీంకోర్టుకు నివేదించిన కక్రూ పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. దీంతో మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వం లో వన్‌మ్యాన్ కమిటీని సుప్రీం ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ పరిధిలో మొత్తం 217 క్లబ్‌లు ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబ సభ్యులు 57 క్లబ్బుల్లో ఉన్నట్లు  క మిటీ గుర్తించింది. ఆ కుటుంబం క్లబ్‌లను గు ప్పిట్లో పెట్టుకొని హెచ్‌సీఏ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నదని నిర్ధారించి తన సిఫార్సుల ను సుప్రీంకు అందించింది.

అయితే హెచ్‌ఏసీ సభ్యులు ఈ రిపోర్ట్‌ను సుప్రీంలో సవాల్ చే యటంతో వారి పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో కూడిన ప్రత్యేక ధ ర్మాసనం విచారణ జరిపింది.  తదుపరి విచారణను గురువానికి వాయిదా వేసింది.