గుడిహత్నూర్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ కు చెందిన దత్తు, నరేష్ లు శుక్రవారం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ కు వెళ్తున్న క్రమంలో సీతాగొంది గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వెనుక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో దత్తు తలకు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతి చెందాగా, నరేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించాగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.