బైంసా (విజయక్రాంతి): మద్యం మత్తులో కిందపడి ఒకరు మృతి చెందారు. పట్టణం ఎస్సై మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం.. పట్టణంలోని గుజిరిగల్లికి చెందిన జాదవ్ గణేష్(27) స్థానికంగా లేబర్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారాడు. శనివారం భట్టిగల్లిలోని మున్నూరుకాపు సంఘం భవనం వద్ద కిందపడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు చేరుకుని పరిశీలించగా, మృతి చెంది ఉన్నాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి బాబురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.