calender_icon.png 21 April, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే అభివృద్ధి.. రెండు కండువాలు

11-04-2025 12:16:00 AM

  1. రెండు జాతీయ పార్టీలే... అభివృద్ధిలో ఒక తాటి పైకి 

పలు అభివృద్ధి పనులకు కలిసి శ్రీకారం చుడుతున్న ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 10 (విజయ క్రాంతి) : పాలమూరు జిల్లాలో అరుదైన సంఘటనలు కళ్లకు కనిపిస్తున్నాయి. గ్రామాలలో నీ పార్టీ నా పార్టీ అంటూ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా విభేదించుకుంటున్న  గ్రామాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. అన్ని గ్రామాల్లో వివిధ పార్టీల నాయకులు ఆ పార్టీ వ్యక్తి ఈ పార్టీ వ్యక్తి అంటూ విభజించుకుంటారు. కాగా అభివృద్ధిలో అందరం.

ఒక తాటిపైకి వెళ్లి అభివృద్ధి చేస్తేనే ప్రజలు సంతోషంగా ఉంటారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముందు నుంచి చెబుతున్న మాట. ఈ మాట ప్రకారమే ఎంపీ డీకే అరుణ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో మోతి నగర్ దగ్గర అండర్ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి తో పాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు.

దీంతో  విభేదించుకున్న నాయకులు సైతం మనమందరం ఒకటే మనలో మనకు ఎందుకు గొడవలు అనే విధంగా పలకరించుకొని వారు కూడా పలకరించుకుంటూ తమ తమ నాయకుల వెనుక తిరుగుతూ మద్దతు తెలియజేస్తున్నారు.

నెలకొన్న సమస్యలను ఇరువురికి చెబుతూ పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్నికల్లో ఎన్నో విమర్శ ప్రతి విమర్శలు చేసుకున్న నాయకులు అభివృద్ధి విషయంలో ఒకే తాటిపైకి వచ్చి శంకుస్థాపనలు చేయడంతో మహబూబ్ నగర్ జిల్లా అంతట ఈ అంశం చర్చిని అంశంగా మారింది. 

కాంగ్రెస్, బిజెపి జాతీయ పార్టీలైనప్పటికీ... ఆ పార్టీలు జాతీయ నాయకత్వంలో ఎప్పటికి కలవనే వాదన ఉంది. జాతీయస్థాయిలో ఆ పార్టీల అధినేతలు కలవకపోయినా చేయవలసిన అభివృద్ధి పనులు అన్ని కలిసి చేస్తే ఎక్కడ ఏ సమస్య ఉన్న వెంటనే ఎవరి పరిధిలో ఉండేవారు పరిష్కరించే దిశగా ముందుకు తీసుకుపోయేందుకు ఎంతో వీలుంటుంది.

ఇందులో భాగంగానే ఎంపీ డీకే అరుణ అన్ని అంశాలలో సంబంధిత ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు ఉండగా మరోవైపు బిజెపి నాయకులు ఉంటూ అభివృద్ధి ఎవరి పార్టీ కండువాలు వారు ధరించి కలిసి అభివృద్ధి పనులు పాల్గొనడం చూపరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వివిధ పనులకు శ్రీకారం చుట్టడంతో మునుముందు మరింత వేగంగా మహబూబ్ నగర్ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.