11-12-2024 12:55:27 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని మధుర జంక్షన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బెల్లంపల్లి హనుమాన్ బస్తీకి చెందిన దెబ్బటి తిరుపతి అనే వ్యక్తి మృతి చెందగా, అతని భార్య, కూతురు, మనవడు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే తిరుపతి మృతి చెందారు. గాయపడ్డ ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.