calender_icon.png 22 February, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేమికలాన్ లో గోడకూలి ఒకరు మృతి

14-02-2025 12:49:57 AM

తాడ్వాయి, ఫిబ్రవరి, 13( విజయ క్రాంతి ): ఇంటి గోడ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలిన  సంఘటనలో ఒకరు మృతి  చెందారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి కలాన్ లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

గోడ నిర్మాణం చేపడుతున్న సమయంలో గోడ కూలిన ప్రమాదంలో గ్రామానికి చెందిన బెస్త నారాయణ (50) అనే వ్యక్తి మృతి చెందారు. గ్రామంలో ఇద్దరు గోడ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది.

ఈ ప్రమాదంలో నారాయణను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన నారాయణను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు నారాయణ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.