26-04-2025 08:42:43 PM
జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కేమ్రాజ్ కల్లాలి వద్ద రోడ్డుపై కర్ణాటక బస్సు టీవీఎస్ మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గాయాలతో కొట్టుమిట్టాడుతున్న జావీద్ అనే వ్యక్తికి మానవత దృప కధంతో సీనియర్ రిపోర్టర్ వాగ్మారే గంగాధర్ తన సొంత కారులో బాధితుడికి బిచ్కుంద ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ప్రథమ చికిత్స చేయించి అనంతరం అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా కృషి చేసి మానవత్వం చాటుకున్నరు. అయితే కౌలాస్ గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు కలుగుతున్నాయి. రోడ్డుపై వరికుప్పలు ఉండడంతో బైక్ను తప్పించకపోయి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.