calender_icon.png 4 March, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

04-03-2025 02:48:17 PM

ఒకరి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్(Dundigal Police Station) పరిధిలో జరిగింది. సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన కార్తీక్(38) నిజాంపేట్ లో నివాసముంటున్నాడు. ఖమ్మం నుండి తన వెర్నా కారులో మంగళవారం ఉదయాన్నే భార్య సింధు, కుమారుడితో కలిసి బయలుదేరాడు. ఉదయం 07:45 నిమిషాలకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గరకు రాగానే మేడ్చల్ నుండి మల్లంపేట్ వైపు వెళ్తున్న డీసీఎంను అతి వేగంగా వెనుక నుండి ఢీ కొట్టాడు. డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సింధు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కొరకు యశోద ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దుండిగల్ సీఐ పి.సతీష్ తెలిపారు.