calender_icon.png 25 April, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు బైక్ ఢీ ఒకరు మృతి

25-04-2025 08:01:20 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఆంధ్రబోర్ హర్ష హోటల్ ముందు బైక్ ను కార్ ఢీకొనగా బైక్ నడుపుతున్న చెవుల రాజలింగయ్య అనే (62) వ్యక్తి మృతి చెందాడని ఎస్సై సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మృతుని స్వస్థలం గొల్లపెళ్లి మండలం అబ్బాపూర్ గ్రామం తన కుమారుడు ఆంధ్ర బోర్, కుమార్తె గాంధి నగర్లో ఉంటారు. శుక్రవారం ఉదయం అందాజా 10:00 గం.. తన బైక్ పై ఉత్కూర్ చౌరస్తా నుండి ఆంద్రబోర్ లోని తన కొడుకు టైర్ల దుకాణంకు వెళ్తుండగా వెనుకాల నుండి గుర్తు తెలియని కార్ ఢీకొట్టి వెళ్లడంతో తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడన్నారు. మృతుని చిన్న కొడుకు చెవుల మహేందర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.