17-04-2025 01:38:22 AM
సూర్యాపేట, ఏప్రిల్ 16(విజయక్రాంతి): మిరపకాయలు ఏరడానికి కూలీలలో వెళ్తూ ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందగా పలువురికి గాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కోటపహడ్ వద్ద జరిగింది.
స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన మహిళలు ఆత్మకూర్ (ఎస్S) మండలం శెట్టిగూడెంలో మిరపకాయలు ఏరే కూలి పనికి అదే గ్రామానికి చెందిన ఆటోలోబయలుదేరి శెట్టిగూడెం వెళ్తుండగా మార్గ మధ్యలో కోటపహాడ్ గ్రామ శివారు చెరువు కట్ట వద్ద అకస్మాత్తుగా ఆటోకు కుక్క అడ్డు రావడంతో ఆటో డ్రైవర్ కుక్కను తప్పించబోయే క్రమములో రోడ్డు పై ఆటో బోల్తా పడిందని తెలిపారు.
ఈ ఘటనలో మాదరబోయిన యాదమ్మ,(50)రోడ్డుపై పడి తలకు తీవ్రమై అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలైనాయని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వం హాస్పటల్కు తరలించామని, మృతురాలు కుమారుడు మాదరబోయిన లింగరాజు ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ కేశరాజుపల్లి శంకర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.