16-04-2025 08:40:25 AM
సూర్యాపేట, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. కూలీలతో వెళుతున్న ఆటో ఆత్మకూర్ (ఎస్) మండలం కొత్తపహాడ్ వద్ద కుక్కను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. మరో ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలు టేకుమట్ల గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.