కల్వకుర్తి, జనవరి 13: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ వద్ద అద్దె ఇంట్లో కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రా మానికి చెందిన మాయని నాగరాజు (32), వంగూరు మండలం కోనేటిపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీని వాసులు నివాసం ఉంటున్నారు.
ఆదివారం రాత్రి భోజనం కోసం బయటికి తమ బైక్‌పై వెళ్లేందుకు ఫుట్‌పాత్‌పై నిలబడి ఉన్నారు. దేవరకొండ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి ఇద్దరు యువకులపైకి దూసుకెళ్లింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులు తీవ్రగా గాయపడగా హైదరాబాద్ తరలించారు.