11-03-2025 01:16:37 AM
అనురాగ్ యూనివర్సిటీలో నిర్వహణ
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): అనురాగ్ యూని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగంలో వన్డే ఇన్ హౌస్ మేనేజ్‌మెంట్ మీట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఫార్మల్, ఇన్‌ఫార్మల్ యాక్టివిటీస్ నిర్వహించారు. బిజినెస్ క్విజ్, యంగ్ మేనేజర్, అడ్ మాడ్ షో, ఫైనాన్షియల్స్ సవెంజర్ హంట్ నిర్వహించారు.
కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎం మహిపతిరావు, విభాగ అధిపతి డాక్టర్ వి.విష్ణు వందన, ప్రొఫెసర్ పీఎస్‌ఎస్ మూర్తి, ప్రొఫెసర్ ఏ మం రావు, ప్రొఫెసర్ సంపత్, ప్రొఫెసర్ వేణుగోపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.