calender_icon.png 1 April, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు

30-03-2025 04:54:13 PM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..

కామారెడ్డి (విజయక్రాంతి): కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తెలిపారు. ఆదివారం ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా కాలభైరవ స్వామినీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా కోటి రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆలయ ఈవో ప్రభు కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగు రవీందర్ గౌడ్ లక్ష్మా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.