22-03-2025 02:16:00 AM
బీజేపీ ఎల్పీ నేత ఏలేటి
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిమిషానికి రూ.కోటికి పైగా అప్పు చేస్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈ లెక్కన గంటకు రూ. 71 కోట్లు.. రోజుకు 1700 కోట్లకు పైగా అప్పు చేస్తోందని చురకలంటించారు. వాటిని చక్కదిద్దడం కోసం బాండ్ల వేలం కోసం ఆర్‌బీఐ వైపు ఆశగా చూస్తోందని దుయ్యబట్టారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల బడ్జెట్ అని, రాష్ట్ర పరిస్థితి తెలియక కాంగ్రెస్ ఇష్టానుసారంగా హామీలు గుప్పించిందన్నారు. ఇప్పు డు వాటికి నిధులు లేక యూనివర్సిటీ, ప్రభుత్వ భూములను విక్రయించి పరిపాలన సాగింస్తుందని ఎద్దేవా చేశారు.
ప్రపంచ బ్యాంకు నుంచి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ చెప్పలేదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును ఉద్దేశించి పేర్కొన్నారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసిన పోలీసులపై చర్య లు తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేయగా.. ఈ అంశం అసెంబ్లీ పరిధిలోకి రాదంటూ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.