calender_icon.png 22 January, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిష్ణోయ్‌ని చంపితే కోటి నజరానా

23-10-2024 12:22:56 AM

కర్ణిసేన అధ్యక్షుడు రాజ్ షెకావత్

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఉత్తర భారతదేశంలో అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌గా మారిన లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు రూ.కోటికిపైగా నజరానా ఇస్తామని రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు రాజ్ షెకావత్ ప్రకటించారు. తమ సంస్థ అధినేత సుఖ్‌దేవ్‌సింగ్ గోగమేడిని చంపిన బిష్ణోయ్‌ని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరి స్తున్న వీడియో వైరల్‌గా మారింది. 2023 డిసెంబర్‌లో గోగమేడిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపింది. ప్రస్తుతం గుజరాత్ జైల్లో ఉన్న బిష్ణోయ్.. అక్కడి నుంచే తన అనుచరులకు మార్గదర్శనం చేస్తూ ఇటీవల మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని హత్య చేయించాడు.