27-03-2025 10:59:52 PM
తాడ్వాయి (విజయక్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో బిజెపి ముందుకుపోతుందని తాడ్వాయి మండల శాఖ బిజెపి అధ్యక్షులు సంతోష్ రెడ్డి తెలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిజెపి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఈ ప్రణాళికలు దేశ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్రావు శ్రీను రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.