11-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : నగరానికి చెందిన ఓ వ్యక్తిని స్టాక్ ట్రేడింగ్ పేరిట మోసం చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి టినా మిట్టల్ , డబ్ల్యూ33బార్క్‌లేస్ పేరిట ఫోన్ కాల్ వచ్చింది. వాట్సప్ గ్రూప్‌లో చేరి పెట్టుబడి పెట్టాలని ఫోన్ చేసిన వ్యక్తులు బాధితుడికి చెప్పారు.
వారు చెప్పిన ఓ ట్రేడింగ్ యాప్‌లో బాధితుడు రూ.2.01కోట్లు పెట్టుబడి పెట్టాడు. కానీ ఆ డబ్బులు తిరిగి రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న పకీర్ శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై మరో 5రాష్ట్రాల్లో కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.