calender_icon.png 4 April, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ కేసులో ఒకరి అరెస్ట్

02-04-2025 12:00:00 AM

హైదరాబాద్  సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన ప్రకారం.. నగరానికి చెందిన ఓ ఉద్యోగికి +917044 970887 అనే నంబర్ నుంచి స్టాక్ మార్కెట్‌లో ఆన్‌లైన్ స్టాక్ పెట్టుబడులపై వాట్సప్ మెసేజ్ వచ్చింది. అందుకు ఓ వాట్సప్ గ్రూప్‌లో చేరాలని సైబర్ మోసగాడు లింక్ ను పంపాడు.

తక్కువ సమయంలో ఓటీఎస్ స్టాక్‌లు, సామ్‌కో గ్రూప్ స్టాక్‌ల ద్వారా ఎక్కు లాభాలను పొందొచ్చని నమ్మిన బాధితుడు ఆ మోసగాడి బ్యాంకు ఖాతాకు రూ.14.63లక్షలను పంపాడు. తన పెట్టుబడులను ఉప సంహరించుకోవాలని బాధితుడు వారిని కోరితే అదనంగా డబ్బులు చెల్లించాలని సైబర్ మోసగాళ్లు డిమాండ్ చేశారు.

ఫోన్, మెసేజ్ ద్వారా వారిని సంప్రదించేందుకు బాధితుడు ప్రయత్నించగా కాల్స్, చాట్‌లను మోసగాళ్లు బ్లాక్ చేశారు. కాగా ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్ నోయిడాకు చెందిన శివశంకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, నాలుగు చెక్‌బుక్‌లు, రెండు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.