calender_icon.png 24 October, 2024 | 5:55 AM

బెల్లంపల్లిలో గంజాయి స్వాధీనం: ఒకరి అరెస్ట్

29-08-2024 03:25:42 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పక్కా సమాచారం మేరకు గురువారం బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని పట్టుకుని 116 గ్రాముల గంజాయిని అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా గంజాయి తరలిస్తున్న విషయం అంగీకరించినట్లు ఎస్సై కె. మహేందర్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 ఇంట్లోని బస్తీకి చెందిన నాగమల్ల దత్తాత్రేయ అనే యువకుని వద్ద గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో అతని పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితున్ని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్ ఎదుట హాజరు పరిచి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై కె. మహేందర్ తెలిపారు.