18-03-2025 12:48:02 AM
మేడ్చల్, మార్చి 17 (విజయ క్రాంతి): భువనేశ్వర్ నుంచి ముంబాయికి కోణార్క్ రైల్లో అక్రమంగా రవాణవుతున్న 10 కేజీల గంజాయిని సోమవారం హెచ్ టి ఎఫ్ డీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు.ఒరిస్సాకు చెందిన దాంపా ప్రధాన్ అనే గంజాయి వ్యాపారీ ముంబాయికి 10 కిలోల గంజాయిని తరలించడానికి నందిగోస నాహక్(21) అనే వ్యక్తి ఎంచుకొని అతడితో 10 కేజీల గంజాయిని తరలించడానికి ఏర్పాటు చేశాడు.
భువనేశ్వర్ నుంచి ముంబాయిలో గంజాయి ఇచ్చి వచ్చినందుకు నాహక్కు రూ. 15 వేలు ఇస్తానని ఒప్పందాం కుదుర్చుకున్నారు.కోణార్క్ రైల్లో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయనే సమాచారంతో కోణార్క్ దిగి కాకతీయ రైలు నా హగ్ ఎక్కాడు. కాకతీయ రైల్లో కూడ తనిఖీలు జరుగుతున్నాయనే భయంతో ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో గంజాయితో దిగాడు.బ స్సు మార్గంలోకాని.. మరో రైల్లో ముంబాయికి వెలుదామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్ టి ఎఫ్ డీ టీమ్ సీఐ నాగరాజ్, ఎస్త్స్ర జ్యోతి సిబ్బంది పట్టుకున్నారు.
నిందితుడి వద్ద ఉన్న రూ. 5 లక్షల విలువ చేసే 10 కేజీలగంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితుడు నందిగోస నాహక్, ఆతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.గంజాయిని పట్టుకున్న టీమ్లో కానిస్టేబుళ్లు లేఖాసింగ్, వినోద్, కాశీలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి కమలాసన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ తిరుపతి యాదవ్లు అభినందించారు.