calender_icon.png 12 March, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

140 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత పరారీలో ఒకరు

10-03-2025 12:11:26 AM

బెల్లంపల్లి, మార్చి 9 (విజయక్రాంతి) : కన్నెపల్లి మండలంలోని సూర్జాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం కన్నెపల్లి వ్యవసాయాధికారి సాయిప్రశాంత్, ఎస్త్స్ర గంగారాం, పోలీస్ సిబ్బంది పక్కా సమాచారంతో బేరి నారాయణ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి నిల్వ ఉంచిన 140 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలను కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లో తాండూర్ సీఐ కుమారస్వామి వెల్లడించారు. నకిలీ విత్తనాలను కలిగి ఉన్న బేర నారాయణ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొండ గొర్ల రాజన్న, సురేష్ అనే వ్యక్తుల నుండి నకిలీ పత్తి విత్తనాలను పొందినట్లు సీఐ వెల్లడించారు.

ప్రస్తుతం పట్టుబడ్డ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితులైన బేర నారాయణ, కొండ గొర్ల రాజన్న లను అరెస్టు చేసినట్లు చెప్పారు. సురేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ కుమారస్వామి వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.