25-02-2025 12:00:00 AM
ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి) ః ఐఐటీలో సీటు రాగానే అంతటితో చదువు ఆపకుండా మంచివారితో స్నేహం చేసుకొని అనుకున్నది సాధించే వరకు పట్టుదలగా చదివి జీవితంలో స్థిరపడినప్పుడే చదివిన చదువుకి సార్ధకత లభిస్తుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం నాడు తన చాంబర్లో కుసుమంచి మండలం గోరీల పాడు తండా గ్రామానికి చెందిన తేజ వత్ సింధు గురుకులం కళాశాల భద్రాచలంలో ఎంపీసీ వరకు చదివి ఐఐటీలో 236 ర్యాంకు సాధించి తిరుపతిలో బీటెక్ చేయడానికి సీట్ సంపాదించిందని ఆయన అన్నారు.
తేజ వత్ సింధు తల్లిదండ్రులు లక్ష్మి, పఖీయ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన పిల్లల చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని ఆయన తెలుపుతూ, మొదటి సంవత్సరం ఐఐఐటి చదవడానికి ప్రోత్సాహంగా 50 వేల రూపాయలు చెక్కు ఆమె తల్లిదండ్రులకు అందించడం జరిగిందని అన్నారు.
ఖాళీ సమయంలో క్రింది తరగతి విద్యార్థిని విద్యార్థులకు తప్పనిసరిగా యొక్క ప్రతిభను వారికి తెలియజేసి చదువుపట్ల మక్కువ కలిగేలా స్ఫూర్తి నింపాలని, అన్నారు.