calender_icon.png 3 April, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకప్పుడు టాయిలెట్లు కడిగా..

05-07-2024 01:44:42 AM

ప్రపంచంలో ఏ పనీ చిన్నది కాదు

ఎన్నో ఎత్తుపల్లాలు దాటి ఈ స్థాయికి వచ్చా

ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్

న్యూ ఢిల్లీ, జూలై 4: ‘ప్రపంచంలో ఏ పనీ చిన్నది కాదు. నా కెరీర్ మొదట్లో నేను ఓ టిఫిన్ సెంటర్లో పనిచేశాను. గిన్నెలు, టాయిలెట్లు శుభ్రం చేశాను. ఇక్కడున్న మీ అందరికంటే ఎక్కువ టాయిలెట్లు శుభ్రం చేశా’ అని ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ (ఎన్వీడియా) సీఈవో జెన్సన్ హువాంగ్ తెలిపారు. ఆయన వీడియోను ఓ జర్నిలిస్టు షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థులను ఉద్దేశించి హువాంగ్ మాట్లాడిన వీడియో ఇది. వీడియోలో హువాంగ్ మాట్లాడిన మాటలు యువత, నిరుద్యోగులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నాయి. నా అనుభవమే నాకు అన్ని పనులను, మనుషులను గౌరవించడం నేర్పింది. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న నేను ప్రస్తుతం నా సంస్థలో ప్రతి ఉద్యోగిని సమానంగా చూడగలుగుతున్నా అని హువాంగ్ చెప్పాడు. ఈ వీడియోను చూసి స్పందించిన మస్క్.. హువాంగ్‌పై ప్రశంసలు కురిపించాడు.