calender_icon.png 26 October, 2024 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

దర్శకుడు బాబీతో మరోసారి..

16-07-2024 12:10:00 AM

రవితేజ సినిమాలతో దర్శకుడిగా పరిచయమైన వారిలో బాబీ (కేఎస్ రవీంద్ర) ఒకరు. తర్వాత పవన్, ఎన్టీఆర్, వెంకటేశ్ వంటి వారితో సినిమాలో చేసి అగ్ర దర్శకుడిగా ఎదిగిన తీరు తెలిసిందే. చిరంజీవి కథానాయకడిగా బాబీ తెరకెక్కించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోనూ రవితేజ కీలక పాత్ర పోషించారు. కాగా రవితేజ కలయికలో మరో చిత్రం ముస్తాబు కానుందని సమాచారం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 109వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బాబీ, ఈ ఏడాది చివరి నాటికి ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనితో పాటే తర్వాతి సినిమా స్క్రిప్ట్ పనుల్ని కూడా కానిచ్చేస్తున్న ఆయన, ఈ కథని రవితేజతో చేసే ఆలోచనలో ఉన్నారట. ‘ధమాకా’ మొదలుకొని రవితేజతో వరుస సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఈ సినిమా రూపొందనుందిట. బాబీ కూడా ఈ సంస్థలో ‘వెంకీ మామ’ సినిమా చేసున్నారు. 2025లో బాబీ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’గా త్వరలో తెరమీదికి రానున్న రవితేజ.. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకుడిగా ఓ సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.