హైదరాబాద్: దేశవ్యాప్తంగా బం గారం ధరలు మరోసారి దిగివచ్చాయి. ఇప్పటికే పతాక స్థాయికి చేరుకున్న పసిడి రేట్లు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొను గోలుదారులు నగల దుకాణాల వైపు చూసే సాహసం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో సోమవారం 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.550 తగ్గి రూ.72,200 లకు వచ్చింది.
అలాగే 24 క్యారెట్ల బంగా రం రూ.600 క్షీణించి రూ. 78,760 లకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయి లో ధరలు క్షీణించాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం రూ.550 తగ్గి రూ.72,350 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.78,910 వద్దకు దిగొచ్చింది. దేశంలో వెండి ధరలు కూడా నేడు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో కేజీ వెండిపై రూ.1000 తగ్గి రూ.1,02,000 వద్దకు చేరింది.