calender_icon.png 28 December, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోమారు శివ తాండవమే!

08-11-2024 12:00:00 AM

నందమూరి బాలకృష్ణ  బోయపాటి శ్రీను కాంబోకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దిరి కాంబోలో వచ్చిన లెజెండ్, సింహ, అఖండ వంటి చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం అఖండకు సీక్వెల్‌గా ‘అఖండ 2  తాండవం’ను రూపొందించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..

ఈ చిత్రంలో బాలకృష్ణ మొదటి భాగంలో మాదిరిగానే శివ భక్తుడిగా నటించనున్నారట. అయితే రెండో భాగంలో ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఆచారాల కోసం అలాగే దేవాలయాలు, వాటి పవిత్రతను కాపాడేందుకు పోరాడే పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

హిందూ గ్రంథాలను నాశనం చేయాలని ప్రయత్నించే కొందరు దుర్మార్గులను తుదముట్టిస్తారట. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలను మించి సినిమా తీయాలని బోయపాటి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య శివ తాండవానికి రంగం సిద్ధమవుతోంది.