calender_icon.png 24 December, 2024 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి.. అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసుల నోటీసులు

24-12-2024 01:41:35 AM

నేడు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : స్టులిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సోమవారం మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడ పల్లి పోలీస్‌స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కు మారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నాడు. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా అల్లు అర్జున్‌కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు..

అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను ఏ11 నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయ న ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపై శాసనసభలో చెప్పారు. 

సీఎంకు కౌంటర్‌గా అల్లు అర్జున్ మీడియా సమావేశం..

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ తనకు ఎవరూ మహిళ చనిపోయిన విషయాన్ని చెప్పలేదని, తనకు తరువాత రోజు మాత్రమే విషయం తెలిసిందని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయ త్నం జరుగుతోందని మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రస్తావించడాన్ని కొందరు తప్పుపడు తుంటే, మధ్యంతర బెయిల్‌పై ఉన్న వ్యక్తి ఈ కేసు విషయమైన మీడియా సమావేశం నిర్వహిం చడాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు. 

తొక్కిసలాట ఘటన వీడియో విడుదల చేసిన సీపీ సీవీ ఆనంద్

అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించి అబద్దాలు చెప్పారని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఎలా జరిగిం దో వివరిస్తూ ఓ వీడియో రికార్డు చేశారు. ఘటన జరిగిన రాత్రి అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చిన సమయం నుంచి అక్కడి నుంచి వెళ్లిపోయే వరకు ఎం జరిగిందో క్లుప్తంగా వీడియో ద్వారా తెలిపా రు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జు న్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.