calender_icon.png 28 January, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి పోలీస్‌గా..ఇక మాస్ జాతరే!

26-01-2025 01:19:11 AM

‘మాస్ జాతర’తో థియేటర్లలో సినీ ప్రియులకు పూనకాలు తెప్పించేందుకు వచ్చేస్తున్నాడు హీరో రవితేజ. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫా ర్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా రూపొం దుతున్న ఈ సినిమాతో భాను బోగవరపు దర్శకు డిగా పరిచయం అవుతున్నాడు. రవితేజ నటిస్తున్న 75వ సినిమా కావటంతో అందరిలో భారీ అంచనాలేర్పడ్డాయి.

తన కెరీర్‌లో మైలురాయి ఈ సినిమాతో విజయాన్ని అందుకోవటం రవితేజకు కూడా చాలా అవసరం. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు.. గణతంత్ర దినోత్సవం కూడా. అందుకే ఆదివారం ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ రెండు రోజులుగా విడుదల చేస్తున్న పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

శుక్రవారం రాత్రి రిలీజ్ చేసిన గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌కు ‘రవన్న మాస్ దావత్ షురూ రా భయ్..’ అంటూ తెలంగాణ యాసలో వ్యాఖ్యను జోడించటం ద్వారా మాస్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది చిత్రబృందం. శనివారం విడుదల చేసిన మరో పోస్టర్‌లో రవితేజ పోలీస్‌గా కనిపించారు. ఈ సినిమాలో రవితేజ సరసన కిస్సిక్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.