calender_icon.png 1 January, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విండీస్ క్రికెటర్‌పై నిషేధం

09-11-2024 01:28:41 AM

బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా కెప్టెన్ షెయ్ హోప్ ఫీల్డ్ సెట్ చేసిన తీరుపై అసహనం వ్యక్తం చేసిన జోసెఫ్ అను చిత వ్యాఖ్యలు చేశాడు. జోసెఫ్ ప్రవర్తనను  సీరియస్‌గా పరిగణించిన విండీస్ క్రికెట్ బోర్డు అతడిపై రెండు మ్యాచ్‌ల పాటు నిషేధం విధించింది.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓవర్‌కు ముందు హోప్ ఫీల్డింగ్ సెట్ చేశా డు. తొలి బంతి ఆఫ్ సైడ్ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డర్ ఎవరు లేకపోవడం జోసెఫ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో హోప్‌తో వాగ్వాదానికి దిగా డు. చాలా సేపు ఇద్దరి మధ్య మాట ల యుద్ధం నడవడంతో అంపైర్లు కాసేపు ఆటను నిలిపేశారు.