calender_icon.png 11 January, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లిపై.. యావ తగ్గుతోంది!

02-07-2024 12:05:00 AM

ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే చచ్చే వరకు అస్సలు వొదిలే వారుకాదు. కానీ ఈరోజుల్లో పెళ్లి చేసుకోవడం ఏదైన గొడవలు జరిగితే వెంటనే విడిపోవడం జరుగుతుంది. అందుకే ఆడవాళ్లు వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. పెళ్లి మాట ఎత్తిగానే భయపడుతున్నారు. అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా నచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటన్నారు. అందుకు వీలైనంత వరకూ పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నారు. అందుకు కారణాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

  1. పెళ్లి కాగానే చాలా బాధ్యతలు పుట్టుకొస్తాయి. కొత్త కుటుంబం, కొత్త ప్లేస్, కెరీర్, కుటుంబం మధ్య బ్యాలెన్సింగ్‌ని కాపాడుకోవడం చేయ్యలేక పెళ్లికి దూరంగా ఉండాలని ఫిక్స్ అవుతున్నారు. 
  2. పిల్లలను కనడం అనేది కొందరు ఇష్ట పడటం లేదు. లైఫ్‌ను భాగస్వామితో కలిసి పంచుకోవాలని అనుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు కావాలని కోరుకుంటారు. కానీ కొంతమంది ఆడవారు పిల్లల్ని ఇష్టపడరు. అబ్బాయి వాళ్లు వెంటనే పిల్లలను కనాలని అనుకుంటారు. అందుకే పెళ్లి అంటే భయపడుతున్నారు. 
  3. అలాగే పెళ్లి తర్వాత అడ్జెస్టెమెంట్‌తోనే బతుకుతున్నారు. దీంతో వారిని చూసి కొంతమంది ఆడవారు ఆలోచించి పెళ్లికి దూరంగా ఉంటున్నారు. వైవాహిక జీవితంలో వచ్చే కలహాలకి వారు భయపడుతున్నారు. అందుకే ఇష్టం లేదని చెప్పేస్తున్నారు. 
  4. పెళ్లి కాగానే చాలా బాధ్యతలు పుట్టుకొస్తాయి. కొత్త ఫ్యామిలీని బ్యాలెన్సింగ్ చేసుకోవడం. ఇవన్నీ చూసి అమ్మాయిలు భయపడిపోతున్నారు. అంతేకాదు పెళ్లి వయసు రాగానే చాలామంది పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని గుచ్చి గుచ్చి అడుగుతారు. అందుకే కొందరు పెళ్లి అంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు.