calender_icon.png 18 January, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4న కోదండరాంకు ఆత్మీయ పౌరసన్మానం

01-09-2024 01:36:06 AM

పోస్టర్ ఆవిష్కరించిన జన సమితి నాయకులు

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఈ నెల 4న చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు ఎం నర్సయ్య తెలిపారు. సన్మాన కార్యక్రమ పోస్టర్‌ను శనివారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాల యంలో నిర్వహించారు.

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రతినిథిగా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధకుడిగిగా ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు  ఎం నర్సయ్య తెలిపారు. 4న ఉదయం 11 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఇందిరాపార్క్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి మీదుగా భారీ ర్యాలీ సాగుతుందన్నారు. కార్యక్రమంలో జనసమితి నాయకులు బద్రుద్ధీన్, ధర్మార్జున్, బైరి రమేశ్, పల్లె వినయ్ తదితరులు పాల్గొన్నారు.