- సభాధ్యక్షులుగా రంగినేని మోహన్ రావు
- సిరిసిల్లలోని రంగినేని ట్రస్టులో కార్యక్రమం
కరీంనగర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రంగినేని సుజాత ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 14న ‘కరీంనగర్ కథలు’ పుస్తక పరిచయ సభ నిర్వహించనున్నారు. రంగినేని ఎల్లమ్మ పురస్కార కమిటీ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు, రేగులపాటి లక్ష్మి(పిల్లల పండుగ రచయిత) సభాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. సిరిసిల్లలోని కరీంనగర్ రోడ్‌లో ఉన్న రంగినేని ట్రస్టులో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి కన్వీనర్ ఆచార్య సీ మృణాళిని, విశిష్ట అతిథిగా ప్రసిద్ధ కథా రచయిత అల్లం రాజయ్య హాజరుకానున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాల యం ప్రొఫెసర్ సి.కాశీం వక్తగా వ్యవహరిస్తారు. సంపాదకుల పక్షన జూకంటి జగ న్నాథం, డాక్టర్ నలిమెల భాస్కర్ కథా సంకలనాన్ని ప్రస్తావిస్తారు. రంగినేని ట్రస్ట్ అధ్య క్షులు రంగినేని నవీన్ కుమార్ వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుంది. కరీం నగర్ కథలు సంపాదకవర్గంలో రచయితలు జూకంటి జగన్నాథం, నలిమెల భాస్కర్, పెద్దింటి అశోక్ కుమార్, పత్తిపాక మోహన్, మద్దికుంట లక్ష్మణ్, గరిపెల్లి అశోక్ ఉన్నారు.