calender_icon.png 22 November, 2024 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16న 25 చోట్ల బీజేపీ నేతల మూసీ నిద్ర

14-11-2024 12:39:25 AM

  1. పాల్గొననున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్
  2. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఈ నెల 16న సాయంత్రం నుంచి మరుసటి రోజు వరకు బీజేపీ నాయకుల మూసీ నిద్ర ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సవాలును స్వీకరించి తాము మూసీ పరివాహక ప్రాంతంలో 25 చోట్ల ఒక రోజు ఉండనున్నామని, రాత్రి కూడా అక్కడే బస చేస చేస్తామని వెల్లడించారు.

బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాత్రి నిద్రకు బీజేపీ ముఖ్యనేతలంతా వస్తారని వెల్లడించారు. మూసీ వెంట జీవిస్తున్న ప్రజలతో కలిసి ఉండి రేవంత్‌రెడ్డికి బీజేపీ నాయకుల కమిట్మెంట్ చూపిస్తామని అన్నారు. మూసీ ప్రక్షాళనకు అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్తామని సీఎం అన్నారని.. ఇప్పుడు మమ్మల్ని తొక్కుకుంటూ పోయి మూసీ ప్రక్షాళన చేయాలని హెచ్చరించారు.

మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, అయితే నదికి ఇరువైపులా ఉన్న ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా ప్రక్షాళన చేస్తే తాము అడ్డుకోబోమని స్పష్టంచేశారు. ప్రజల ఇండ్లను కూల్చేందుకు బుల్డోజర్లతో వస్తే తామే అడ్డుగా నిలబడతామని హెచ్చరించారు.

ఈ నెల 16న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు అంతా కలిసి ప్రజలతోనే ఉంటామని, అక్కడ భోజనాలు చేస్తామని, నిద్రిస్తామని, మరుసటి రోజు దినచర్య కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తామని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక రోజంతా ఉండి వారికి భరోసా కల్పిస్తామని చెప్పారు.