calender_icon.png 12 January, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరణం గారి వీధిలో..

11-01-2025 12:00:00 AM

కిట్టు తాటికొండ, కశ్మీరా, రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీగోపిచంద్ కొండ నటిస్తు న్న సినిమా ‘కరణం గారి వీధి’. దర్శకద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. సౌత్ బ్లాక్‌బస్టర్ క్రియేషన్స్ బ్యానర్‌పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. త్వరలోనే విడు దల కానుంది. ఈ నేపథ్యం లో ఈ సినిమా పోస్టర్‌ను ప్రము ఖ నటుడు మురళీ మోహన్ శుక్రవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో రోహిత్ మాట్లాడు తూ.. ‘మధ్యతరగతి కుటుంబం కష్టాలను వినోదాత్మకంగా డైరెక్టర్స్ చాలా బాగా చిత్రీకరించారు’ అని తెలిపారు. ‘మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలతో తీసిన ఈ సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం’ అని దర్శకులు హేమంత్, ప్రశాం త్ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వినోద్ షిణగం; సంగీతం: సుకుమార్ పమ్మి.