calender_icon.png 29 December, 2024 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కింగ్‌గా మారిన వేళ

28-12-2024 03:10:54 AM

* అమెరికాతో అణుఒప్పందం  

* వ్యతిరేకించిన వామపక్షాలు

* ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన కూటమి పార్టీలు

* అయినా వెనుకంజ వేయని మన్మోహన్ సింగ్

దేశాన్ని తన చతురతతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించిన మన్మోహన్ సింగ్ అప్పటి పంజాబ్ (ప్రస్తుత పాకిస్తాన్)లో జన్మించారు. గ్రామంలో పుట్టిన మన్మోహన్ తరచూ మత సామరస్యం గురించి మాట్లాడేవారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లారు.

అధికారిక సమాచారం ప్రకారం ‘1948లో మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీ నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం 1957లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి అర్ధశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. 

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: యూపీఏ హయాం లో 2004లో సంకీర్ణ ప్రభుత్వ ప్రధానిగా మన్మోహ న్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని ఆయన నడు పుతున్నారు. రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా అమెరికాతో పౌర అణు ఒప్పందాన్ని చేసుకోవాలని మన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వాషింగ్టన్‌లో జరిగిన  శిఖరాగ్ర సమావేశంలో అమె రికా అధ్యక్షుడు బుష్, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు.  ఈ ఒప్పందం 2008 అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మన్మోహన్ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించాయి.

సమాజ్‌వాదీ పార్టీ కూడా మొదట ఒప్పందాన్ని వ్యతిరేకించినా అనంతరం తన వైఖరిని మార్చుకుంది. ఈ క్రమంలో 2008లో మన్మోహన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయినా మన్మోహన్ ప్ర భుత్వం గట్టెక్కింది. ఈ ఒప్పందం భారత్‌కు అమె రికా నుంచి లభించిన గొప్ప విజయంగా భావిం చారు. అణు ఒప్పందంపై వెనకడుగు  వేయకుండా మన్మోహన్ సింగ్ తీసుకున్న కఠిన వైఖరి అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు పెరగడానికి దోహద పడింంది.

ఈ క్రమంలో అవసరమైనపుడు తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటానని ఈ ఒప్పందం ద్వారా నిరూపించారు. తాను మెతక వైఖరితో ఎల్ల ప్పుడు ఉండనని, తనపై ఎవరూ పెత్తనం చెలాయించలేరని, దేశం కోసం ఏదైనా చేస్తానని ప రోక్షంగా తెలిపారు. అమెరికాతో అణు ఒప్పందంపై ధృఢంగా నిలబడి అణుశక్తి కార్యక్రమాలు నిర్వహించే దేశాల్లో భారత్‌కు సుస్థిర స్థానం కల్పించారు.

“ అణు ఒప్పందంపై ఆయన తీసుకున్న స్టాండ్ సోనియా గాంధీకి లొంగి ఉంటారనే అపోహను ప్రజల ఊహ నుంచి తుడిచి పెట్టేసింది. చివరికి సింగ్ కింగ్‌గా మారాడు” అని సంజయ్ బారు తాను రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్  మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్‌” పుస్తకంలో పేర్కొన్నారు.  

అణు ఒప్పందమే ఉత్తమ క్షణం

అమెరికాతో  పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం తనకు ఉత్తమ క్షణమని, అలాగే ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇంకా ఏమి చేయలేకపోవడం అతిపెద్ద వైఫల్యమని మన్మోహన్ సింగ్ అన్నారు. 2014 జనవరి 3న  ప్రధానిగా నిర్వహించిన తన చివరి మీడియా సమావేశంలో  ఉత్తమ క్షణం, అతిపెద్ద వైఫల్యం ఏమిటని విలేకర్లు ప్రశ్నించారు.

దానికి ఆయన సమాధానం  ఇస్తూ  ఈ ప్రశ్నలపై ఆలోచించడానికి తనకు సమయం కావాలని అన్నారు. అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సమయమే తనకు ఉత్తమ క్షణమని తెలిపారు. తాను ఎల్లప్పుడూ మీడియాకు అందుబాటులో ఉన్నానన్నారు. 

యాదృచ్ఛికంగానే ఆర్థిక మంత్రిగా..

మన్మోహన్ పేరు వినబడగానే ఆయన ఓ సైలెంట్ ప్రధాని అని, యాదృచ్ఛికంగా బాధ్యతలు స్వీకరించారని చాలా మంది అనుకుం టారు. అయితే ఈ విమర్శలపై స్వయంగా మన్మోహన్ సింగే స్పందించి తాను కేవలం ప్రధాన మంత్రి పదవినే కాదు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు కూడా యాదృచ్ఛికంగానే స్వీకరించినట్టు చెప్పారు.

2018లో ‘చేజింగ్ ఇండియా’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మన్మోహన్ సింగ్ తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలను మీడియాతో పంచుకున్నారు.

“నేను యాదృచ్ఛికంగా ప్రధాన మంత్రి పదవినే కాదు.. ఆర్థిక మంత్రిగా కూడా యాదృచ్ఛికంగానే బాధ్యతలు చేపట్టాను. 1991 జూన్ 21న భారత ప్రధాని పీవీ నర్సింహారావు నుంచి ఫోన్ వచ్చింది. మన్మోహన్ జీ మీరెక్కడున్నారు? అని పీవీ అడిగారు. నేను యూజీసీలో ఉన్నానని చెప్పా. మీకు అలెగ్జాండర్ ఏం చెప్పలేదా? అని పీవీ అడిగారు. చెప్పారు కానీ, నేను సీరియస్‌గా తీసుకోలేదని చెప్పా.

లేదు ఇది చాలా సీరియస్, మీరు ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చుకుని ప్రమాణ స్వీకారానికి రండి అని పీవీ చెప్పారు. అలా పీవీ ఫోన్ చేయడంతో నేను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను” అని మన్మోహన్ చెప్పుకొచ్చారు. దీంతో ఆ సమావేశంలో ఉన్న వాళ్లంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఇదే సమయంలో తనకు ఉన్న నిశ్శబ్ద ప్రధాని అనే ట్యాగ్‌లైన్‌ను ఖండించారు.

మీడియాతో మాట్లాడేందుకు తాను భయపడలేదని స్పష్టం చేశారు. “నేను క్రమం తప్పకుండా మీడియాను కలిశాను. ప్రతి విదేశీ పర్యటన తర్వాత నేను విమానంలో లేదా భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి పర్యటనకు సంబంధించిన వివరాలను తెలియజేశాను” అని చెప్పారు. 

మన్మోహనామిక్స్ అంటే..

దేశ ఆర్థిక రంగంపై తనదైన ముద్ర వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వేశారు. ఈ క్రమంలో 1991లో ఆర్థికమంత్రిగా తాను ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, ఈ క్రమంలో ఆయన పాటించిన ఆర్థి క విధానాలకు ‘ ‘మన్మోహనామిక్స్’ అనే పేరు వచ్చింది.

 ‘సమయం వచ్చినపుడు ఆలోచనను భూమిపై ఏ శక్తి ఆపదు’ అని ప్రఖ్యాత ఫ్రెంచ్ కవి విక్టర్ హ్యూగో అన్న పదాలను ఉటంకిస్తూ 1991లో లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగాన్ని మన్మోహన్ ముగిం చారు. ప్రపంచంలో భారత్ ఒక ప్రధాన ఆర్థికశక్తిగా ఆవిర్భవిస్తుందనే ఆలోచన తన మదిలో ఉందని ఆయన చెప్పారు.

సరళీకరణ, సంస్కరణలు భారత్‌లో కొత్త శకానికి నాంది పలికాయని, ఇవి దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా మార్చాయన్నారు.

వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా పదవులు అలంకరించారు. ఈ అనుభ వంతో ఆర్థకశాస్త్రం, పాలనపై తరచుగా తన అనుభవాలను వెల్లడించారు.

ఆర్థిక సంస్కరణలు, సమ్మిళిత వృద్ధిపై అతని దృష్టి,నిబద్ధతను ప్రతిబింబించే అయిదు ప్రముఖ కోట్‌లు ప్రసిద్ధి చెందాయి.

క్యాపిట్, టెక్ ఓపెన్ మార్కెట్ ఎకానమీ స్వీకరించడం

పారిశ్రామీకరణ కోసం నాలుగు దశాబ్దాలుగా మనం ఇపుడు అభివృద్ధి దశకు  చేరుకున్నామని, విదేశీ పెట్టుబడులను స్వాగతించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తానను ఎలా పెట్టుబడిదారుడిగా మారాడో ఆయన అమెరికన్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

ఆకలి నిర్మూలన, దేశాభివృద్ధి

పోషకాహార లోపాన్ని పరిష్కరించడం కేవలం నైతక ఆవశక్యత మాత్రమే కాకుండా ఆర్థిక అవసరమని అన్నారు. దేశాభివృద్ధికి భవిష్యత్  తరాల ఆరోగ్యం, ఉత్పాదకత చాలా కీలకమన్నారు. ఇందుకోసం సబ్సిడీ ఆహార ధాన్యాలకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఇందుకోసం పీడీఎస్, మిడ్ డే మీల్స్ పథకాలను బలోపేతం చేశారు. 

ఆర్థిక మాంద్యం తర్వాత భారత్ వృద్ధిరేటు 7.9%

ప్రభుత్వం తీసుకున్న సమర్థ విధానాలు, సమయానుకూల జోక్యం కారణంగా భారత్ 2009లోతన జీడీపీలో 7.9% వృద్ధి రేటును సాదించింది. పెట్టుబడలును ప్రమాదకరం, స్వల్ప కాలిక బెట్టింగ్‌ల ద్వారా నడపకుండా ఆర్థిక వ్యవస్తను నిర్మించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. దీర్ఘకాలి అభివృద్ధిక ్ధసంస్కరణలు మద్దతు ఇవ్వాలన్నారు. 

* 2016 డిమానిటైజేషన్ దుర్వినియోగం

2016లో ప్రధాని మోదీ చేసిన నోట్ల రద్దు అనేది మన కరెన్సీ, బ్యాంకింగ్‌పై ప్రజల నమ్మకాన్ని కోల్పేయేలా చేసిందన్నారు. నోట్ల రద్దు వ్యవసాయ వృద్ధి, చిన్న పరిశ్రమలను దెబ్బతీస్తుందన్నారు. ప్రజల కష్టాలను దూరం చేయడానికి ఆచరణాత్మక మార్గాలను కొనుగొనాలని సూచించారు.

 పదవీకాలాన్ని 10 స్కేల్‌లో రేట్ చేయడం

తన పదవీకాలంలో యూరో సంక్షోభం, ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్నటికీ తాను బాగానే పనిచేశానని ఆయన అన్నారు. 2014లో తన పదవీకాలాన్ని 10 స్కేల్‌లో రేట్ చేయాలని అడిగారు. తన పదవీకాలంలో భారత ఆర్థిక వ్యవస్థను సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఒక స్థిరమైన విజయగాథగా అభివర్ణించారు. మనం నిజాయితీగా ఉండి పనులు  చేయడం ముఖ్యమని ఆయన అన్నారు.  

ఆ కారంటే మహా ఇష్టమట

మౌనముని మన్మోహన్ సింగ్ ఎన్నో హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి పలు లగ్జరీ కార్లలో ప్రయాణాలు చేశారు. కానీ మన్మోహన్‌కు మాత్రం తన వద్దనున్న మారుతి 800 కారు మాత్రమే అమితంగా నచ్చేదట. ఆయనకు మారుతి 800 కారు సొంతంగా ఉండేదని 2004 మధ్య ఎన్‌పీజీకి హెడ్‌గా వ్యవహరించిన అరుణ్ తెలిపారు. ఆయన ప్రస్తు తం యూపీలోని కన్నౌజ్ సదర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

‘కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ప్రధానివి.. కానీ ఈ మారుతి 800 నాది’ అని మన్మోహన్ చెప్పేవారట. 1996లో మన్మోహన్ తన కలల కారు అయిన మారుతి 800ను కొనుగోలు చేసినపుడు డబ్బులు లేకపోతే ఆయన భార్య గుర్శరణ్ ఆ డబ్బులను చెల్లించిందట.