calender_icon.png 28 November, 2024 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ కడుపుతో..

28-11-2024 12:00:00 AM

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా తేనె తీసుకోవడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు. తేనె తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గును నివారించడం లో కూడా సహాయపడుతుంది. తేనెలో ఫ్రీ బయోటిక్ లక్షణాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక చెంచా తేనె తినడం వల్ల చలికాలంలో జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఒక చెంచా తేనెలో పసుపు, కొద్దిగా అల్లం రసం తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో తేనెను తీసుకుంటే గుండె పనితీరు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే అందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కొద్దిగా గోరు వెచ్చని నీటిలో తేనె, కాస్త పసుపు వేసుకుని తాగితే అలర్జీ, జలుబు వంటి ఎన్నో సమస్యలు దూరమవుతాయి. ఇవి అలెర్జీ లక్షణాలను తగ్గిస్తాయి. తేనెని డైట్‌లో యాడ్ చేస్తే గ్యాస్, అసిడిటీ సమస్యలు దూరం అవుతాయి. మలబద్ధకం తగ్గుతుంది. వేడి నీటిలో తేనె కలిపి ఉదయాన్నే తాగితే జీర్ణక్రియకి మేలు చేస్తుంది.