calender_icon.png 28 February, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఓంకారేశ్వర రథయాత్ర

28-02-2025 12:30:21 AM

కోహీర్ పట్టణ పుర వీధుల్లో ఊరేగింపు

కోహీర్, ఫిబ్రవరి27: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోహీర్ పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓంకారేశ్వర రథయాత్ర బాజాబజంత్రీలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ నాగభూషణ దీక్షితులు సురుద్భావ సంస్థ వ్యవస్థాపకులు సద్గురు దక్షిణా మూర్తి దీక్షితులు ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభిం చారు.

పట్టణ ప్రధాన వీధుల గుండా ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. పురవీ ధులలో ప్రజలు రథయాత్రకు ఘణ స్వాగతం పలికారు. ప్రత్యెక పూజలు నిర్వహిం చారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రథయాత్రలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.